ఈవారం విడుదలైన చిత్రం 'యాత్ర'. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. మహి.వి. రాఘవ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు మంచి వసూళ్లే దక్కించుకుంది. దాదాపు 2.5 కోట్ల షేర్‌తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. వీకెండ్ మొత్తం ఇదే ఊపు ఉంటుందని భావించాయి ట్రేడ్ వర్గాలు. కానీ... క్రమంగా 'యాత్ర' వసూళ్లు మందగించడం ఆశ్చర్యపరిచాయి.
తొలి వారాంతంలో కేవంల రూ.5 కోట్లు మాత్రమే సాధించి నిరాశ పరిచింది. రెండో రోజు 97 లక్షల షేర్ తెచ్చుకున్న ఈ చిత్రం, మూడో రోజు మరో కోటి రూపాయిల్ని ఆర్జించింది. సోమవారం నుంచి వసూళ్లు మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. దాదాపు 12 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుకుంది. ఇప్పటికి 40 శాతం కూడా వెనక్కి రాలేదు. ఇక శాటిటైల్ హక్కులే నిర్మాతని కాపాడాలి. ఇప్పటి వరకూ `యాత్ర` శాటిలైట్ హక్కుల్ని అమ్మలేదు. ఇప్పుడు బేరం ఎలా సాగుతుందో చూడాలి.