'యాత్ర' సినిమాలో అనసూయ ఓ చిన్న పాత్రలో నటించింది. పాత్ర నిడివి తక్కువే అయినా ముఖ్యమైన పాత్ర అది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుచరితారెడ్డి పాత్రలో మెరిసిన అనసూయ సినిమా విడుదలైన రోజు పెద్దగా సందడి చేయలేదు. వాస్తవానికి పబ్లిసిటీ విషయంలో యాత్ర టీమ్ చాలా ప్లాన్డ్‌గా వ్యవహరించింది. హైప్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శుక్ర, శని, ఆదివారాల్లో వైఎస్ అభిమానులు ధియేటర్స్‌ని కవర్ చేసేశారు. శనివారం కొంతమేర డల్‌గా కనిపించాయి వసూళ్లు. అయితే ఆదివారం సీన్ మారింది. అనసూయ మీడియా ముందుకు రావడం, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో 'యాత్ర'కు అదనపు గ్లామర్ వచ్చింది. అనసూయకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడదే 'యాత్ర'కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
'యాత్ర' టీమ్ పబ్లిసిటీ ప్లానింగ్ బాగా వర్కవుట్ అయ్యింది. అసలు కథ ఈ రోజే మొదలు కానుంది. ఎందుకంటే వీకెండ్ నుండి ఫస్ట్ డ్రై డేని 'యాత్ర' ఫేస్ చేయబోతోంది. దర్శకుడు మహి.వి.రాఘవ 'యాత్ర' సినిమాకి విమర్శకుల ప్రశంసల్ని అందుకుంటున్నారు. సినిమా తెరకెక్కించడమే కాదు, ప్రమోషన్స్ విషయంలో మహి వ్యూహం ఫలించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.