'ఎన్టీఆర్' తో పోలిస్తే... 'యాత్ర' హిట్టే మ‌రి!

By iQlikMovies - February 09, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

వైఎస్ఆర్ చేసిన పాద యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `యాత్ర‌`. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూల్ని ద‌క్కించుకుంది. మ‌మ్ముట్టి న‌ట‌న‌కు, మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమా  క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత తెచ్చుకుంటుంది? అనేది ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

 

ఈ సినిమా బ‌డ్జెట్ 12 నుంచి 15 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. ఈ సినిమాని దాదాపుగా సొంతంగా విడుద‌ల చేసుకున్నాడు నిర్మాత‌. అడ్వాన్సుల రూపంలో మంచి మొత్త‌మే ద‌క్కింది. థియేట‌రిక‌ల్ రూపంలో క‌నీసం 7 నుంచి 10 కోట్ల వ‌ర‌కూ వ‌స్తుంద‌ని టాక్‌. 

 

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ మూడు చోట్లా శాటిలైట్ హ‌క్కుల్ని అమ్ముకునే ఛాన్సుంది. ఈ మూడూ క‌లిపి ఎంత కాద‌న్నా రూ.10 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే ఎంత కాద‌న్నా క‌నీసం రూ.5 కోట్ల ప్రాఫిట్ రావ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది. 'ఎన్టీఆర్‌' సినిమాని భారీ హంగుల‌తో తీసి న‌ష్ట‌పోయాడు బాల‌య్య‌. ఆ సినిమాతో పోలిస్తే యాత్ర బెట‌రే క‌దా??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS