టాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు ఎక్కువైంది. ఇప్పటికే అరడజను బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. అందులో `యాత్ర` ఒకటి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఇది. ఆ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.
రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఆనే ఆసక్తి ముందు నుంచీ నెలకొని ఉంది. ఆ పాత్రలో ఓ యువ హీరో నటిస్తారని, అందుకోసం కొంతమంది యంగ్ హీరోల్ని సంప్రదించారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. `యాత్ర`లో జగన్మోహన్‌రెడ్డి పాత్రే లేదట. కేవలం ఈ సినిమా వైఎస్ ఆర్ పాదయాత్ర, దాని చుట్టూ నడిచిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సాగుతుందని, వాటిలో జగన్‌కి ప్రాధాన్యం లేకుండా పోయిందని సమాచారం.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా మారడం, హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడం ఇవన్నీ పతాక సన్నివేశాల్లో చూపిస్తారట.వైఎస్ ఆర్ వారసుడిగా జగన్ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా ముగుస్తుందని, జగన్‌కి కేవలం ఒక్క షాట్‌కే పరిమితం చేశారని తెలుస్తోంది. ఆ ఒక్క షాట్‌నీ సింబాలిక్‌గా చూపించనున్నారని, అందుకే జగన్ పాత్ర లేకుండానే ఈ సినిమా ముగిసిందని సమాచారం. డిసెంబరు 21న ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. జగన్ లేని రాజశేఖర్ రెడ్డి కథని అభిమానులు ఎంత వరకూ స్వీకరిస్తారో చూడాలి.