సినీ నటుడు మోహన్‌బాబుకు జైలు శిక్ష.!

మరిన్ని వార్తలు

ప్రముఖ నటులు, నిర్మాత, వైకాపా నేత మోహన్‌బాబుకు హైద్రాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్‌ బౌన్స్‌కి సంబంధించి 2010లో దర్శకుడు వై.వి.యస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'సలీం' సినిమాకి వై.వి.ఎస్‌ చౌదరి దర్శకత్వం వహించారు. ఆ టైంలో సినిమా చిత్రీకరణకుగాను 40.5 లక్షల చెక్‌ను మోహన్‌బాబు, వై.వి.ఎస్‌ చౌదరికి ఇచ్చారు. ఆ చెక్‌ నగదుగా మారకపోవడంతో వై.వి.ఎస్‌ చౌదరి 2010లో కోర్టునాశ్రయించారు. 

 

అప్పటి నుండీ విచారణ జరుగుతున్న ఈ చెక్‌ బౌన్స్‌ కేసు తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా తుది తీర్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు 10వేల రూపాయలు జరిమానా విధించగా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు, 41,75,000 రూపాయలు జరిమానా విధించింది. ఒకవేళ మోహన్‌బాబు ఈ మొత్తం చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్షను పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో మోహన్‌బాబు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS