ఈమధ్య విడుదలకు ముందే మంచి బజ్ తెచ్చుకున్న సినిమాల్లో `మజిలీ` ఉంటుంది. నాగచైతన్య- సమంత పెళ్లయ్యాక తొలిసారి కలసి నటించిన చిత్రమిది. 'నిన్ను కోరి`తో దర్శకుడిగా తొలి అడుగులోనే నిరూపించుకున్న శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన వచ్చింది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సంతృప్తికరంగా పూర్తి చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 23 కోట్ల బిజినెస్ చేసుకుంది. నైజాంలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో రూ.3 కోట్లకు ఈ సినిమాని అమ్మేశారు. చైతూ సినిమాకి ఇవి మంచి రేట్లే. సీడెడ్ నుంచి రూ.2.5 కోట్లు వచ్చాయి. తూర్పు, పశ్చిమ కలసి మరో రూ3 కోట్ల వరకూ వ్యాపారం జరిగిపోయింది. డిజిటల్, శాటిలైట్ రూపంలోనూ భారీ మొత్తం వచ్చింది. ఇలా ఏ రూపంలో చూసినా విడుదలకు ముందే నిర్మాత సేఫ్ జోన్లో పడిపోయాడు. ఇక బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.