టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది సమంత అక్కినేని. వరుస ఆఫర్లతో దూసుకెళ్లడమే కాదు, వరుస విజయాలూ ఆమెని ఏరి కోరి వరిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 5 సమంతకు అగ్ని పరీక్షగా మారింది. ఆ రోజు తన రియల్ లైఫ్ భర్త చైతూతో పెళ్లి తర్వాత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా 'మజిలీ' విడుదల కానుంది. ఆ సినిమా సమంతకు చాలా ప్రెస్జీజియస్ మూవీ.
ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టి తీరాలి సమంత. సారీ.. సారీ.. తన భర్తకు హిట్టును గిఫ్ట్‌గా ఇచ్చి తీరాలి. అందుకే తన సినిమాల విడుదల విషయంలో ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండే సమంత, 'మజిలీ' విషయంలో మాత్రం కొంత ప్రెషర్ ఫీలవుతోందట. ఆ ప్రెషర్ని ఎన్ని రకాలుగా తీర్చుకోవాలో అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోందట. తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది సమంత.
అది కూడా కాలి నడకన వెళ్లి దర్శనం చేసుకోవడం విశేషం. ఇదంతా తన భర్తకు 'మజిలీ'తో బెస్ట్ హిట్ ఇవ్వడం కోసమే అనుకోవాలి. ఏమో భార్యగా సమంత పూజలు ఫలించి చైతూకు 'మజిలీ' కెరీర్లో బెస్ట్ హిట్‌గా నిలవాలని మనం కూడా ఆశిద్దాం. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించింది.