బాహుబలి 2కి హిందీలో నెం1 పొజిషన్

మరిన్ని వార్తలు

బాహుబలి 2 రిలీజ్ తో ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. అందులో భాగంగా బాలీవుడ్ లో అత్యదిక వసూళ్ళ పేరిట ఉన్న రికార్డు కూడా బద్దలయ్యింది.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అందించిన సమాచారం ప్రకారం, బాహుబలి 2 హిందీ వెర్షన్ కలెక్షన్స్ రూ 400 కొట్ల మార్క్ టచ్ చేయడానికి దగ్గరిలో ఉందట. ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ పేరిట ఉన్న ఆమిర్ ఖాన్ దంగల్ ( రూ 387.38 కోట్లు)ని అధిగమించి బాలీవుడ్ లో నెం1 చిత్రంగా చరిత్రసృష్టించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా రూ 1300కోట్ల వరకు కలెక్ట్ చేసి ఓ సరికొత్త రికార్డు నెలకొల్పే దిశగా అడుగులువేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాహుబలి 2 ప్రభంజనం ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో రూ 150 కోట్ల షేర్ అందుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ కలెక్షన్స్ హవా చూస్తుంటే, బాహుబలి 2 త్వరలోనే రూ 1500 మార్కుని చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS