బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?

మరిన్ని వార్తలు

బాలకృష్ణ 101వ చిత్రం-పైసా వసూల్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబందించిన కథ ఇదేనంటూ ఒక వార్త చక్కర్లు కొడుతున్నది.

ఆ వార్త సారాంశం ఏంటంటే- బాలకృష్ణ ఈ చిత్రంలో అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా విలన్ గ్యాంగ్ ని మట్టుపెట్టే భాగంగా వాళ్ళ గ్యాంగ్ లోనే చేరుతాడట! అయితే ఇందులోబాలయ్య పాత్ర పోలీస్ ఆఫీసరా కాదా అన్నది తెలియదట!

ఈ వార్తలో నిజం ఎంత ఉన్నది అన్న అంశం పక్కనపెడితే, ఈ కథాంశం పోకిరి అలాగే అమితాబ్ నటించిన బుడ్డా హోగా తేరా బాప్ చిత్రాల కథలోతో పోలి ఉండడం ఆసక్తిరేపుతున్న అంశం.

పైసా వసూల్ చిత్ర రిలీజ్ కి ఇంకొన్ని గంటలే ఉన్నందున ఈ సస్పెన్స్ కి త్వరగానే ముగింపు పడనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS