అమలాపాల్‌ - ఏంటా మిస్టరీ?

మరిన్ని వార్తలు

వీపు మీద పెద్ద టాట్టూ. ఇదేదో మిస్టరీ అట. దాన్ని సజీవంగా ఉంచుతోందట. ఇంతకీ ఈ టాట్టూ మిస్టరీ ఏంటట? అసలీ టాటూని తన వీపుపై వేయించుకున్న ముద్దుగుమ్మ ఎవరా అనే కదా ఆలోచిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అమలాపాల్‌. టాటూ సంగతి ఏమోగానీ టాటూ పేరుతో బ్యాక్‌ గ్లామర్‌ని ఎక్స్‌పోజ్‌ చేసేస్తోంది ముద్దుగుమ్మ అమలాపాల్‌. మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో అవకాశాలు తగ్గాయి. తెలుగులో చరణ్‌తో 'నాయక్‌' సినిమాలో నటించింది. మలయాళంలో అయితే వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం బోలెడన్ని సినిమాలున్నాయి. అందుకే ప్రస్తుతం అమలాపాల్‌ మకాం బెంగళూరుకి మార్చేసింది. ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్‌ విజయ్‌ని ప్రేమించి పెళ్లాడింది, పలు కారణాల వల్ల భర్తకు దూరమయ్యింది. పెళ్ళి తర్వాత సినిమాల్లో ఫుల్‌ బిజీగా మారింది. అంతేకాదు ఇంకా హాట్‌గా కనిపిస్తోంది కూడా. కొత్త ఇన్నింగ్స్‌లో అమలాపాల్‌ హాట్‌ అప్పీల్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రస్తుతం ఇలా టాటూతో ఏదో మెసేజ్‌ చెప్పాలని చూస్తోంది. అయితే అదేంటో అర్ధం కావడంలేదు కానీ, ఈ టాటూకి అర్ధం ఈ ముద్దుగుమ్మే అందంగా వివరించి చెప్పాలి మరి. ఏది ఏమైనా అమలాపాల్‌ టాట్టూ మేటర్‌ భలే హాట్‌ టాపిక్‌ అయ్యింది ఇప్పుడు సోషల్‌ మీడియాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS