టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు: ఓ బ‌డా హీరో గ‌జ‌గ‌జ‌?

మరిన్ని వార్తలు

డ్రగ్స్ కేసులో మ‌రింత‌మంది టాలీవుడ్ సెల‌బ్రెటీల పేర్లు బ‌య‌ట‌కు వచ్చే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు రావ‌డంతో... టాలీవుడ్ అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది. ఎప్పుడు ఎవ‌రి పేరు వినాల్సివ‌స్తోందో.. అంటూ ఆత్రుత‌గా ఎదురుచూస్తోంది. డ్ర‌గ్స్ రుచి తెలిసినోళ్లు, ఆ మ‌త్తు నుంచి ఏనాడో బ‌య‌ట‌ప‌డిన‌వాళ్లు, ఇప్పటికే విడుద‌లైన జాబితాలో ఉన్న 12మందితో కాస్తో కూస్తో ట‌చ్ ఉన్న‌వాళ్లు కాస్త భ‌య‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్ర క‌థానాయ‌కుడు ఈ విష‌యంలో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాడ‌ట‌. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఓ యువ క‌థానాయ‌కుడికీ పూరీ కాంపౌండ్‌కీ స‌న్నిహిత సంబంధాలున్నాయి. పూరి పేరు ఎలాగూ... ఈ జాబితాలో ఉంది. త‌న పేరు కూడా బ‌య‌ట‌కువ‌స్తుందేమో అనుకొని ఆ హీరో కాస్త కంగారు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.  ఈమ‌ధ్య జ‌రిగిన ఓ ఆడియో ఫంక్ష‌న్ కి అతిథిగా ఆ హీరో పేరు వినిపించింది. అయితే డ్ర‌గ్స్ భ‌యంతో... ఆ హీరో ఆడియో ఫంక్ష‌న్‌కి సైతం డుమ్మా కొట్టాడ‌ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS