ఇంకోస్సారి బికినీలో 'పులి' పిల్ల

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ నికీషా పటేల్‌ మరోసారి బికినీ సొగసుల్తో రెచ్చిపోయింది. గతంలో ఓ సారి బికినీల్లో భిన్న రకాలుగా సెల్ఫీలు దిగి కుర్రోళ్ల మతులు పోగొట్టింది. తాజాగా మళ్లీ ఇంకోస్సారి తన బికినీ అందాలను సిగ్గు లేకుండా ఆరేసింది. బికినీలో కనిపించేందుకు సిగ్గు పడడం లేదా? అందాల్ని ప్రదర్శించేందుకు సెలబ్రిటీస్‌కి బికినీ వెరీ వెరీ ఇంపార్టెంట్‌ ప్రాపర్టీ. అందులో వంపు సొంపుల్ని మాత్రమే ఆస్వాదించాలి కానీ, సిగ్గుపడకూడదంటోంది హాట్‌ బ్యూటీ నికీషా పటేల్‌. కొంచెం బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు బాగా స్లిమ్‌ అయ్యింది. స్లిమ్‌ బాడీతో బికినీలో మెరిసిపోతోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'పులి' సినిమాలో నటించింది. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో పాపం పిల్ల అస్సలు మొహమాటపడదు. అయినా కానీ అమ్మడికి ఆఫర్స్‌ మాత్రం చిక్కడం లేదు. ఎంత గ్లామర్‌ ఉంటే మాత్రం ఆఫర్స్‌ వస్తేనే కదా ఆ అందాలకు విలువ. సోషల్‌ మీడియా మాత్రం అమ్మడి అందాలకు హీటెక్కిపోతోందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ అందాలకు బిగ్‌ స్క్రీన్‌ మెరుపులు అద్దేది ఎవరో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS