పవన్‌ కళ్యాణ్‌ సో స్మార్ట్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్‌

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌ పనులు బిజీగా జరుగుతున్నాయి. సెట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఉన్న ఫోటోల్ని చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ పిక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ చాలా హ్యాండ్‌సమ్‌ అండ్‌ స్మార్ట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. పవన్‌ లుక్‌ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. అంచనాలు భారీగా ఉన్నాయి. 'అత్తారింటికి దారేది' సినిమా బాక్సాఫీస్‌ రికార్డుల్ని కొల్లగొట్టింది. ఆ సినిమా టైటిల్‌ 'అ' అక్షరంతో స్టార్ట్‌ అయ్యింది. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాకి 'అ' అక్షరంతో స్టార్ట్‌ అయ్యేలా 'అజ్ఞాతవాసి' టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే టైటిల్‌పై ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా సెట్స్‌ నుండి బయటికి వచ్చిన పవన్‌ హ్యాండ్‌సమ్‌ లుక్‌కి మాత్రం రెస్పాన్స్‌ అదిరిపోతోంది. కొత్త ముద్దుగుమ్మలు కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌లు ఈ సినిమాలో పవన్‌తో జత కడుతున్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మలతో కొన్ని రొమాంటిక్‌ సాంగ్స్‌ చిత్రీకరణ జరిగింది. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే అనిరుధ్‌ మ్యూజిక్‌లో వచ్చిన ఓ సాంగ్‌ యూత్‌ని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS