బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న 'బిగ్‌బాస్' రియాల్టీ షోకి వీకెండ్‌లో రెట్టింపు ఉత్సాహం అందుతోంది. ఎన్టీఆర్ వీకెండ్స్‌లో సందడి చేస్తున్నారు. మిగతా ఐదు రోజులు అంతంత మాత్రాన సాగుతున్న ఈ షోకి శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ తనదైన వ్యాఖ్యానంతో షోకి అదనపు గ్లామర్ తీసుకొచ్చి, ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచెత్తుతున్నారు. అయితే ఈ వీకెండ్‌కి హీరో రానా అతిధిగా వెళ్లారు. రానా రాకతో ఈ షో మరింత అందంగా మారింది. పంచెకట్టులో రానా హౌస్ మేట్స్‌లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చాడు. జస్ట్ అతిధి పాత్రే రానాది. అలాగే అతిధి సత్కారాలు కూడా బాగానే అందుకున్నాడు ఈ సర్‌ప్రైజింగ్ అతిధి. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న రానా అదే గెటప్‌తో 'బిగ్‌బాస్' హౌస్‌లోకి వచ్చి, అక్కడి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌నీ ఆశ్చర్యపరిచాడు. అఫకోర్స్ అక్కడి కంటెస్టెంట్స్‌కి బయట ఏం జరుగుతోంది అనే సమాచారం మాత్రం ఇవ్వలేదండోయ్ రానా. ఎంతగా అడిగినా రానా బయటి విషయాలు ఏమాత్రం చెప్పలేదు. అది బిగ్‌బాస్ రూల్. దాన్ని రానా కూడా ఫాలో అయ్యాడు. రానాని చూసి హౌస్ మేట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ కొత్త మనిషి తమ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, సరికొత్త ఆనందాన్ని తమకి పంచారనీ హౌస్‌మేట్స్ ఫీలయ్యారు. ఏదేమైనా ఇటీవలి కాలంలో రానా, పంచెకట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోవడం అభినందనీయం. రానా పంచె కడుతుంటే, ఆ హైటూ, పర్సనాలిటీ పంచెట్టుకే కొత్త గ్లామర్‌ని తెచ్చిపెడ్తుందనీ చెప్పొచ్చు.