కాటమరాయుడు ప్రమోషన్స్ కి ‘నో’ చెప్పిన శృతి హాసన్?!

మరిన్ని వార్తలు

శనివారం జరిగిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శృతి హాసన్ కనిపించకపోవడంతో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి, అందులో ముఖ్యంగా బయటకి వినిపిస్తున్న కారణం పవన్-శృతిలకు షూటింగ్ సమయంలో తలెత్తిన మనస్పర్ధలు అని. అందుకనే శృతి శనివారం జరిగిన ఈవెంట్ కి దూరంగా ఉందని అంటున్నారు.

ఇంకొంతమంది మాత్రం రెమ్యునరేషన్ కి సంబంధించి ఏర్పడిన అభిప్రాయబేధాలు కూడా ఒకింత కారణమని కూడా తెలుస్తున్నాయి.
కారణాలు ఏమైనప్పటికీ ఈ అమ్మడు ఈవెంట్ కి డుమ్మా కొట్టినట్టే ప్రొమోషన్స కి కూడా కొడితే ఈ చిత్రంపై కొద్దోగొప్పో ఎఫెక్ట్ పడొచ్చు అన్నది ఫిలిం నగర్ వర్గాల టాక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS