త్రుటిలో తప్పించుకున్న సన్నీ లియోన్

మరిన్ని వార్తలు

ప్రముఖ నటి సన్నీ లియోన్ త్రుటిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడింది.

ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే, సన్నీ తన భర్తతో కలిసి ఒక ప్రైవేటు జెట్ లో ప్రయాణిస్తుండగా ఆ విమానం కొద్దిసేపు సిగ్నల్స్ కోల్పోయి క్రాష్ అయ్యే స్థితికి వెళ్ళింది.

దీనికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న ప్రతికూల వాతావరణమే అని చెప్పింది. అయితే పైలట్లు అనుభవజ్ఞులు కావడంతో ఆ విమానాన్ని క్రాష్ అవ్వకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారని అని తెలిపింది.

మొత్తానికి మృత్యువు అంచుల దాకా వెళ్ళి సురక్షితంగా రావడంతో ఆమె ఆ దేవుడికి తన కృతజ్ఞతలు చెప్పుకుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS