కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం '118'. కేవి గుహన్ దర్శకత్వం వహించిన 118 చిత్రం శుక్రవారం విడుదలైంది. డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నాయి. తొలి మూడు రోజులకూ ఈ చిత్రం రూ.4 కోట్లు వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే 1.68 కోట్లు సాధించింది. సీడెడ్‌లో 64 లక్షలు సాధించిన ఈ చిత్రం, ఉత్తరాంధ్రలో 47 లక్షలు తెచ్చుకుంది.
సోమవారం మహాశివరాత్రి సెలవు కావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. సోమవారం కనీసం కోటి రూపాయలు వసూలు చేసినా సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేశారు. ఆరు కోట్లకు ఆయన ఈ సినిమాని కొన్నారని టాక్. ఆ మొత్తం దాదాపుగా రాబట్టుకునే ఛాన్స్ ఉంది. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఈ చిత్రానికి మరో 8 కోట్ల వరకూ వచ్చాయి. ఎటు చూసినా ఆర్థిక పరంగా `118` గట్టెక్కేసినట్టే.