తమిళంలో ఘన విజయం సాధించిన '96' చిత్రాన్ని తెలుగులతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ విజయ్ సేతుపతి- త్రిష జంటగా నటిస్తే, ఇక్కడ శర్వానంద్- సమంత కలసి నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రానికి తెలుగులో 'జానకి దేవి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. '96' చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్.. ఇప్పుడు రీమేక్‌కీ ఆ బాధ్యత తీసుకున్నాడు.
త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో శర్వా, సమంతల పాత్రలు రెండు కోణాల్లో, రెండు వయసుల్లో ఉంటాయి. యంగ్ శర్వానంద్, యంగ్ సమంత కోసం చిత్రబృందం ఆడిషన్లు నిర్వహించి.. వాళ్ల పోలికలకు దగ్గరగా ఉన్న ఇద్దరిని ఎంచుకున్నారు. శర్వా గెటప్ కూడా కాస్త విభిన్నంగా కనిపించబోతోంది. అందుకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేశారు.