జనసేనాని తరపున రంగంలోకి దిగిన అల్లు అర్జున్..!

మరిన్ని వార్తలు

దేశ రాజకీయాల్లో ప్రత్యేక మార్పు తీసుకురావాలన్న ఆశయంతో బరిలోకి దిగిన పవన్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. తనదైన శైలిలో యువతని ఇన్స్పైర్ చేసేలా పవర్ ఫుల్ స్పీచులిస్తూ తన ఆశయ సాధనకి ఇన్ని రోజులు ఒక్కరే పోరాడారు. ఎన్నికల హీట్ చివరి దశకి చేరుకున్న ఈ టైంలో మెగా హీరోలంతా పవన్ పై తమకున్న అభిమానాన్ని చాటుతూ జనసేన తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

 

ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారం కోసం మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాకపోవడంతో.. డిజప్పాయింట్‌ అయిన ఫ్యాన్స్‌ని పునరుత్తేజపరిచేలా జనసేన తరపున తమ మద్దతుని తెలియచేస్తూ వచ్చారు. ఇప్పటికే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ మరియు మెగా డాటర్ నిహారిక తదితరులు పవన్ కోసం తమదైన శైలిలో ప్రచారాలు చేసారు. లేటెస్టుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయ్యారు. 

 

మొన్నీమధ్య జనసేనాని పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగ బాబులకు తన మద్దతును తెలుపుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసాడు బన్నీ. తాజాగా, ఈ రోజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి పాలకొల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కాగా, ఈ రోజుతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నిక ప్రచార కార్యక్రమాలు ముగియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS