రకుల్‌ పని అంతేనా.?

By Inkmantra - February 27, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

ఎన్ని ప్రయత్నాలు చేసినా రకుల్‌ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు సౌత్‌లో. వరుసగా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. ఏ అవకాశాన్ని అయినా అందిపుచ్చుకోవడానికి రకుల్‌ రెడీగా ఉంది. కానీ తెర వెనుక ఏం జరుగుతుందో ఏమో కానీ, వెనువెంటనే ఓకే అయ్యాయనుకున్న ఛాన్సెస్‌ కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయ్‌. బాలీవుడ్‌ సినిమాలు ఒప్పుకుంటే ఇలాగే ఉంటుంది అని నెటిజన్లు రకుల్‌పై విరుచుకుపడుతున్నారు. 

 

కానీ రకుల్‌ విషయంలో ఇది చాలా అన్యాయమే అనాలి. గతంలోనూ టాలీవుడ్‌తో సహా బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసిన ముద్దుగుమ్మలున్నారు. కానీ రకుల్‌కే ఎందుకిలా జరుగుతోందో. ఇలియానాకి కూడా ఇలాగే జరిగింది. రీ ఎంట్రీ కోసం ఎన్నో పడిగాపులు పడి 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ చుక్కుదురైంది. దాంతో రేస్‌ నుండి ఇలియానా సింపుల్‌గా తప్పుకుంది. ఇప్పుడు రకుల్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఆఖరికి రెమ్యునరేషన్‌ తగ్గించుకోవడానికి కూడా రకుల్‌ సిద్ధపడిందట. 

 

అయినా కానీ సౌత్‌లో దర్శక, నిర్మాతలు రకుల్‌కి అవకాశమే ఇవ్వడం లేదు. కొత్త భామను దిగుమతి చేసుకోవడానికైనా సిద్ధపడుతున్నారు కానీ, రకుల్‌ని మాత్రం ఎంపిక చేసుకోవడం లేదు. ఇదిలా ఉంటే, నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'మన్మధుడు 2'లో రకుల్‌ హీరోయిన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా ఫ్లాష్‌ బ్యాక్‌లో ఏజ్డ్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ, సౌత్‌ మొత్తం రకుల్‌ని ఇలా కట్టడి చేసేసిందేంటో పాపం.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now