ఝాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణాలివే

By iQlikMovies - February 13, 2019 - 10:10 AM IST

మరిన్ని వార్తలు

బుల్లి తెర న‌టి ఝాన్సీ ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. నిండా పాతికేళ్లు కూడా లేని ఝాన్సీ ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. ఝాన్సీ ఆత్మ‌హ‌త్య వెనుక 'ప్రేమ వైఫ‌ల్యం' కార‌ణ‌మ‌ని ముందు నుంచీ అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ప్రేమ‌లో విఫ‌ల‌మ‌వ్వ‌డం, ప్రియుడు హ్యాండ్ ఇవ్వ‌డం వ‌ల్లే... ఝాన్సీ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.  దీనంత‌టికీ కార‌ణం.. ఝాన్సీ ప్రియుడు సూర్య‌తేజ అని పోలీసులు అనుమానించి త‌న‌పై కేసు న‌మోదు చేశారు.

 

2018 ఏప్రిల్‌లో ఝాన్సీకి సూర్య‌తేజ‌తో ప‌రిచ‌యం అయ్యింది. అది ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడు. సూర్య‌తేజ‌కి విజ‌య‌వాడ‌లో ఓ సెల్‌ఫోన్ షాపు ఉంది. అక్క‌డి నుంచి త‌ర‌చూ ఝాన్సీ కోసం హైద‌రాబాద్ వ‌స్తుండేవాడు. 'నువ్వు న‌టించ‌డం మానేయాలి' అన్నది సూర్య పెట్టిన మొద‌టి ష‌ర‌తు. దానికి ఝాన్సీ కూడా ఒప్పుకుంది. ఎప్పుడైతే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారో, అప్పుడే ఝాన్సీ న‌ట‌న‌కు స్వ‌స్తి ప‌లికింది. అప్ప‌టి నుంచీ ఓ బ్యూటీ పార్ల‌ర్ నిర్వ‌హిస్తూ అక్క‌డే బిజీగా ఉంటోంది. సూర్య‌తేజ త‌ర‌చూ ఝూన్సీని అనుమానిస్తూ ఉండేవాడు. ఫోన్ ఎంగేజ్ వ‌చ్చినా 'ఎవ‌డితో మాట్లాడుతున్నావ్‌' అంటూ గొడ‌వ పెట్టుకునేవాడు.  

 

ఇటీవ‌ల సూర్య తేజ‌కు ఓ బైక్ కూడా కొనిచ్చింది ఝాన్సీ. అయితే ఈమ‌ధ్య ఝూన్సీ ఇంటికి వ‌చ్చి 'మ‌న పెళ్లి జ‌ర‌గ‌దు..'  అని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో ఝాన్సీ క‌ల‌త చెందింది. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రికీ ఫోన్లో త‌ర‌చుగా గొడ‌వ‌లు అవుతుండేవి. సూర్య‌తేజ ఝాన్సీ నెంబ‌రుని బ్లాక్ లిస్టులో ఉంచ‌డంతో మ‌రింత క‌ల‌త చెందింది. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెర‌గ‌డంతో త‌ట్టుకోలేక ఝాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని పోలీసులు నిర్దారించారు. ఝాన్సీ మ‌ర‌ణం త‌ర‌వాత సూర్య తేజ ప‌రారీలో ఉన్నాడు. అయితే ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. సూర్య‌తేజ‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS