చిత్రసీమలో ఎవరికైనా సరే - గాడ్ ఫాదర్లు ఉండాల్సిందే. హీరోయిన్లకు అది ఇంకా అత్యవసరం. ఓ హీరోయిన్ ఫ్లాపుల్లో ఉన్నా, ఇంకా అవకాశాలు వస్తూన్నాయంటే తను చాలా గొప్ప ప్రతిభావంతురాలని అర్థం చేసుకోవాలి. లేదంటే వెనుక బలమైన అండ దండలున్నాయని తెలుసుకోవాలి. రకుల్ విషయంలో రెండోదే జరుగుతోందని టాక్.
2018లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్. దాంతో కథానాయికగా రకుల్ పని అయిపోయిందనుకున్నారంతా. ఇలాంటి పరిస్థితుల్లో `దేవ్`లో అవకాశం దక్కించుకుంది. కార్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల అవుతోంది. అయితే ఈ ఛాన్స్ రావడానికి కారణం.. కార్తినే అని టాక్. కార్తి రికమెండేషన్ చేయడం వల్లే రకుల్‌కి ఈ ఆఫర్ వచ్చిందట.
కార్తి ఇప్పటి వరకూ హీరోయిన్ల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉంటాడని, అలాంటిది రకుల్ పై ఇంత ప్రత్యేకమైన శ్రద్ద ఎందుకు చూపిస్తాడో తెలియడం లేదని చెన్నై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీరిద్దరూ కలసి ఇది వరకు ఖాకీ అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందని, అందుకే ఈ ఆఫర్ రకుల్‌కి వచ్చేలా చేశాడని చెప్పుకుంటున్నారు.