అఖిల్‌ది 6 ప్యాక్‌ కాదు 8 ప్యాక్‌.!

మరిన్ని వార్తలు

'మిస్టర్‌ మజ్ను' సినిమాతో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్కినేని అఖిల్‌. 'తొలిప్రేమ'తో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఇకపోతే అఖిల్‌, నిధి అగర్వాల్‌ జంట ఆకట్టుకుంటోంది. ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో అఖిల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపిస్తున్నాడు. కానీ అది 8 ప్యాక్‌ బాడీ అట. ఆ 8 ప్యాక్‌ బాడీ కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డాడట. 

 

8 నుండి 9 నెలలు కేవలం చేపలే తిన్నాడట. అఖిల్‌ నటించిన రెండు సినిమాల్లోనూ ఫిట్‌గానే కనిపిస్తాడు. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కదా. కానీ ఈ సినిమాలో తన 8 ప్యాక్‌ బాడీని కేవలం తన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసమే హైలైట్‌ చేశారట. ఎక్కువ భాగం లండన్‌లోనే ఈ సాంగ్‌ చిత్రీకరణ జరిపారట. ఈ పాట స్క్రీన్‌పై చాలా బాగుంటుందంటున్నాడు అఖిల్‌. ప్లేబోయ్‌లాంటి కుర్రోడు ఓ అమ్మాయి ప్రేమతో లవర్‌ బోయ్‌లా ఎలా మారిపోయాడన్నదే ఈ సినిమా స్టోరీ. అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన టైటిల్‌ మజ్ను. 

 

ముచ్చటగా మూడోసారి ఆ టైటిల్‌ని క్యారీ చేస్తూ వస్తున్న అఖిల్‌కి అదృష్టం కలిసొస్తుందే లేదో చూడాలి మరి. అయితే టైటిల్‌ చివర్లో 'బోయ్స్‌ విల్‌ బి బోయ్స్‌' అనే క్యాప్షన్‌లో ఓ మీనింగ్‌ దాగుందట. అది మాత్రం సినిమా చూసినవారికే కన్వే అవుతుందట. అబ్బా ఎంత తెలివైనోడో చూశారా.? అఖిల్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇలా ఇచ్చాడు. ఇకపోతే ప్రమోషన్స్‌ విషయంలోనూ చిత్ర యూనిట్‌ చాలా కేర్‌ తీసుకుంటోంది. చరణ్‌, ఎన్టీఆర్‌తో అఖిల్‌ కలిసి ఉన్న ఫోటోని పోస్ట్‌ చేసి, ఆల్రెడీ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద బిస్కెట్‌ వేసేశాడు అఖిల్‌.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS