బెల్లంకొండ నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరో తెలుసా.?

మరిన్ని వార్తలు

స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలను, అందులోనూ భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించే యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. గతేడాది 'సాక్ష్యం', 'కవచం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సినిమాలు బాగానే ఉన్నాయన్న టాక్‌ వినిపించినా, కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయాయి ఈ రెండు సినిమాలు. మరో రెండు సినిమాలతో ఈ ఏడాది బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో తాజాగా మరో చిత్రానికి సై అంటున్నాడనీ టాలీవుడ్‌ సమాచారమ్‌. 

 

గతేడాది తమిళంలో మంచి విజయం సాధించిన 'రాత్ససన్' మూవీని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో బెల్లంకొండ ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్‌ వర్మ ఈ సినిమాకి దర్శకత్వ వహించనున్నాడట. ఈ సినిమాలో హీరోతో పాటు, విలన్‌ పాత్రకూ ప్రాధాన్యత ఉంది. ఆ విలన్‌ పాత్ర కోసం ఓ యంగ్‌ హీరోని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే బెల్లకొండ సినిమాల్లో ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అందుకే స్టార్‌డమ్‌ ఉన్న హీరోయిన్స్‌ని తన సినిమాల కోసం ఎంచుకుంటూ ఉంటాడు బెల్లకొండ. 

 

అలాగే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కావట్లేదట. ఓ స్టార్‌ హీరోయిన్‌ని ఈ సినిమా కోసం తీసుకోవాలనుకుంటున్నాడట. ఆ లిస్టులో కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఓ బాలీవుడ్‌ భామ పేరు కూడా ఈ లిస్టులో ఉందనీ టాక్‌. ఆల్రెడీ సమంత, కాజల్‌, పూజాహెగ్దే తదితర భామలతో ఆన్‌ స్క్రీన్‌ ఆడి పాడేసిన బెల్లంకొండ నెక్ట్స్‌ ఏ స్టార్‌ హీరోయిన్‌ని టార్గెట్‌ చేశాడో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS