మహేష్‌తో సుకుమార్‌ మళ్లీ అలాంటిదేనా.?

మరిన్ని వార్తలు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సుకుమార్‌, తదుపరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 'రంగస్థలం' విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా. నేటివిటీ పరంగా ఓల్డ్‌ నేటివిటీని టచ్‌ చేశాడు. అయినా అనూహ్యంగా సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక మహేష్‌బాబుతో సుకుమార్‌ తెరకెక్కించబోయే సినిమా కూడా కొంచెం అటూ ఇటూగా ఇదే తరహాలో ఉండబోతోందని సమాచారమ్‌. 

 

అయితే ఇది ఫారెస్ట్‌ నేపథ్యంలో ఉండబోతోందనీ తెలుస్తోంది. కథ ఆల్రెడీ ఓకే అయిపోయిందట. మహేష్‌కి బాగా నచ్చేసిందట. స్క్రిప్టు అంతా పక్కాగా రెడీ చేసేశాడట. టెక్నికల్‌గా, స్క్రీన్‌ప్లే పరంగా ఈ సినిమాని చాలా స్టైలిష్‌గా రిచ్‌గా తెరకెక్కించనున్నాడట సుకుమార్‌. అంతా రెడీ, ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి. ప్రస్తుతం 'మహర్షి'తో మహేష్‌బాబు బిజీగా ఉన్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 

 

పొలాచ్చిలో షూటింగ్‌ జరుపుకుంటున్న 'మహర్షి' నెక్ట్స్‌ దుబాయ్‌లో లాస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరపనున్నారు . అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదలకు ముందే సుకుమార్‌ సినిమా పట్టాలెక్కించేయనున్నారనీ తాజాగా అందుతోన్న సమాచారమ్‌. గతంలో సుకుమార్‌ - మహేష్‌ కాంబినేషన్‌లో '1 - నేనొక్కడినే' తెరకెక్కిన సంగతి తెలిసిందే.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS