ప్రేమ‌తో రా+ ఆరెంజ్ + అఖిల్ ప్రేమ = మ‌జ్ను

మరిన్ని వార్తలు

అఖిల్ నుంచి వ‌స్తున్న మూడో చిత్రం.. మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ సినిమా క‌థ చూచాయిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ట్రైల‌ర్‌లో వ‌చ్చిన సీన్లు అల్లుకుంటే ఆరెంజ్‌, ప్రేమ‌తో రా సినిమాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. వాటితో పాటు.. ఇందులో అఖిల్ ప్రేమ క‌థ కూడా మిక్స్ చేసిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. అఖిల్‌ శ్రియా భూపాల్‌ని ప్రేమించిన సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాలూ వీళ్ల ప్రేమ‌ని ఆమోదించాయి. ఘ‌నంగా నిశ్చితార్థం కూడా జ‌రిగింది.

 

కానీ... ఈ ప్రేమ‌క‌థ‌కు అనుకోని బ్రేక్ ప‌డింది. అఖిల్- శ్రియ ఇద్ద‌రూ విడిపోయారు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ఆ వెంట‌నే శ్రియ భూపాల్ మ‌రొక‌ర్ని పెళ్లి చేసుకుంది. ఈ ఎపిసోడ్ అంతా ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెస్తున్నామంటే... అఖిల్ తాజా సినిమా 'మిస్ట‌ర్ మ‌జ్ను'లో ఇలాంటి సన్నివేశం ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. అఖిల్ నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు, కొన్ని స‌న్నివేశాలుగా తార‌స‌ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది.

 

త‌న ప్రేమ‌క‌థ  బ్రేక‌ప్ ద‌శ‌కు వ‌చ్చిన‌ప్పుడు అఖిల్ త‌న జీవితంలో ప‌డిన ఆవేద‌న‌ని కొన్ని సంభాష‌ణ‌ల్లో చెప్పించాడ‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడిగా వెంకీ అట్లూరి అఖిల్‌కి మంచి స్నేహితుడు. త‌న ప్రేమ‌క‌థ గురించి బాగా తెలుసు. ఆ స్ఫూర్తితోనే కొన్ని స‌న్నివేశాల్ని జోడించాడ‌ని తెలుస్తోంది. మ‌రి అఖిల్ స్వీయ క‌థ‌కు ఎలాంటి అప్లాజ్ వ‌స్తుందో తెలియాలంటే ఈనెల 25 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే 'మిస్ట‌ర్ మ‌జ్ను' ఆ రోజే విడుద‌ల అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS