బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియాభట్ తెలుగులో తెరంగేట్రం చేయనుందని ఎప్పటినుండో టాక్ స్ప్రెడ్డింగ్లో ఉంది. అయితే అదింతవరకూ జరగలేదు. కానీ ఇప్పుడు టైమొచ్చిందేమో అనిపిస్తోంది. ఆలియాభట్ కూడా తెలుగులో పాదం మోపేందుకు రెడీగానే ఉంది. అయితే తెలుగులో సినిమా అంటూ చేస్తే జూనియర్ ఎన్టీఆర్తోనే చేస్తానని ఓ సారి ఆలియాభట్ చెప్పింది. త్వరలో అది జరిగేలానే ఉందనిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా 'బాహుబలి' తర్వాత రాజమౌళి యూనివర్సల్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన నుండి రాబోయే సినిమా కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా ఈగర్‌గా ఎదురు చూస్తోంది. నిజానికి బాలీవుడ్లో 'బాహుబలి' రికార్డు తర్వాత ఆ రికార్డుల్ని కొల్లగొట్టిన హిందీ సినిమా రాలేదింతవరకూ.
ఈ సంగతి పక్కన పెడితే, 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్' కావడంతో ఈ సినిమాకి యూనివర్సల్ అప్పీల్ తీసుకురావాలనుకుంటున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమాలో హీరోయిన్స్ ఎంపికలో కొంత జాప్యం జరుగుతోంది. ఖచ్చితంగా సినిమాకి హీరోయిన్స్ ప్లస్ అయ్యేలా ఉండాలని రాజమౌళి ఆలోచన. అందుకే బాలీవుడ్ భామను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఆ క్రమంలోనే ఆలియాతో చర్చలు జరిగాయని సమాచారమ్. మరో ముద్దుగుమ్మగా టాలీవుడ్ సంచనలం రష్మికా పేరు లిస్టులో వినిపిస్తోంది.