అఫీషియ‌ల్‌: జనసేనలో చేరిన నాగబాబు.!

మరిన్ని వార్తలు

మెగా బ్రదర్‌ నాగబాబు జనసేనలో చేరారు. జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు నాగబాబు. నర్సాపురం నుండి నాగబాబు లోక్‌సభకు పోటీ చేయనున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా నాగబాబు కీలక భూమిక పోషించారు. అభిమానుల్ని ఒక్క తాటి పైకి తీసుకురావడంలో పార్టీకి నాగబాబు కీలకంగా వ్యవహరించారు. 

 

ఇక ఈ మధ్య నాగబాబు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ, అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇక తాజాగా నరసాపురం నుండి నాగబాబు డైరెక్ట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాగబాబు జనసేనలో చేరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం నుండి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇటీవల నాగబాబు అక్కడి అభిమానులతో మంతనాలు జరిపారు. 

 

తమ్ముడు అయినా కానీ అభిమానుల మాదిరి పవన్‌ కళ్యాణ్‌ తనకు కూడా నాయకుడే అని, తన నాయకుడి కోసం ఎప్పుడైనా, ఏమైనా చేయడానికి తాను సిద్ధమనీ నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. భీమవరం, పాలకొల్లు స్థానాల నుండి పవన్‌ కళ్యాణ్‌ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వెస్ట్‌ గోదావరి నుండే అన్నదమ్ములిద్దరూ ఎన్నికల బరిలోకి దిగడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS