స్నేహితులని ఇంకెప్పుడూ నమ్మకూడదు.. అలీని అస్సలు నమ్మను అంటూ పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు అలీ... తనని కాదని వైకాపాలో చేరడం పవన్ మనసుని బాధించింది. అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. దీనిపై అలీ కూడా స్పందించాడు. ఓ వీడియో లో పవన్ పై కొన్ని ప్రశ్నలు సంధించాడు.
అలీ ప్రశ్నలు ఇవే..
1. "అలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను అని మీరంటున్నారు... ఏం సాయం చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా? ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా. నా వల్ల ఎవరైనా లాభం పొందారు తప్ప. నేను ఎవరి వద్దా చేయి చాపలేదు. నేను ఎవరినీ ఏమీ అడగలేదు.’’
2. ‘‘అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయ పడ్డా’ అన్నారు. ఏ విధంగా సాయపడ్డారు? డబ్బిచ్చారా? నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా. నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు. ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప. వెళ్లి అడుక్కోను.’’
3. మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎదగాలని మీ ఆఫీస్‌కు వచ్చి మంచి మనసుతో మీకు ఖురాన్‌ను ఇచ్చాను. మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైనులో ఉండే మొదటి వ్యక్తిని నేను. నా చుట్టానికి టికెట్ ఇచ్చానని మీరు అన్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? లేదా మీరు నాకు చెప్పి ఇచ్చారా? మీరు ఏ రోజైనా నాకు ఫోన్ చేసి, ‘అలీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను పార్టీ పెట్టా. నా పార్టీలోకి రా’ అని అడిగారా?
4. వైకాపా తరపున ప్రచారం చేస్తే తప్పా? మాకంటూ సొంత ఇష్టాలు, అభిప్రాయాలు ఉండకూడదా?
5. నరసారావు పేట ఎంపీ సీటు నా బంధువులకు నన్ను అడిగి ఇచ్చారా?
- ఇవీ పవన్ పై అలీ సంధించిన ప్రశ్నలు. మరి వీటికి పవన్ కళ్యాణ్ ఏమి చెబుతాడో చూడాలి?