పవన్ పై తన అభిమానం చూపించుకున్న నితిన్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో పవన్ భక్తులు ఎవరంటే... ముందుగా వినిపించే పేరు... నితిన్. తనకు వీలున్న ప్రతీసారి పవన్ ని గుర్తుచేస్తూనే ఉంటాడు. తన సినిమాల్లో పవన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానం మరో సారి చూపించుకున్నాడు నితిన్. జనసేన పార్టీకి తన తరపున 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. 

 

పవన్ కి వరుసగా ఎదురు  దెబ్బలు తగులుతున్నాయి. అలీ లాంటి స్నేహితుడే హ్యాండ్ ఇచ్చాడు. చిత్రసీమ నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఒకప్పుడు ఆహా పవనూ అన్నవాళ్ళే ఇప్పుడు విమర్శణాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ సమయంలో నితిన్ ముందుకొచ్చి విరాళం ఇవ్వడం, తన సపోర్ట్ ప్రకటించడం నైతికంగా పవన్ ని బలపరుస్తాయి. మరో వైపు మెగా హీరోలు ఒకొక్కరూ పవన్ కి తమ సంఘీభావం చూపిస్తున్నారు. చరణ్, అల్లు అర్జున్, ఇప్పుడు... కళ్యాణ్ దేవ్ కూడా పవన్ వైపుకు వచ్చేశారు . ఇక మెగాస్టార్ రావడమే తరువాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS