ఉగాదికి ఫిక్స్ చేస్తార‌ట‌

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందా? అని మెగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `అభిమానులు ఓపిక ప‌ట్టాల్సిందే.. త్వ‌ర‌లోనే అప్ డేట్స్ ఇస్తాం` అంటూ చిత్ర‌బృందం కూడా ప్ర‌కటించింది. ఇప్పుడు ఆ శుభ ముహూర్తం వ‌చ్చేసింది. బ‌న్నీ సినిమాకి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ ఉగాదిన వ‌చ్చేస్తోంది. 

 

షూటింగ్ డీటైల్స్‌, క‌థానాయిక పేరు ఆ రోజు అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపుగా ఆ పేరే ఖాయ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వీలైతే విడుద‌ల తేదీ విష‌యంలోనూ ఓ క్లారిటీ ఇచ్చేయాల‌ని.. త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌. ఓ హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తిగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `నాన్న‌.. నేను` అనే టైటిల్ కూడా గ‌ట్టిగా వినిపిస్తోంది. ఉగాదిన ఈ విష‌యాల‌పై కూడా ఓ క్లారిటీ రావొచ్చేమో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS