నిఖార్సైన హిట్‌ ఒక్కటొస్తే చాలంటోన్న హాట్‌ భామ.!

మరిన్ని వార్తలు

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. అతి చిన్న వయసులోనే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్‌ అయిన ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో పెద్దగా సక్సెస్‌ కాలేకపోతోంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. కానీ చెప్పుకోదగ్గ హిట్స్‌ మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతోంది. అన్నింటికన్నా ముందే 'కుంగ్‌ఫూ యోగా'లో ఇంటర్నేషనల్‌ స్టార్‌ జాకీచాన్‌ సరసన నటించేసిన రికార్డు కూడా అమ్మడి ఖాతాలో వుంది. 

 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హిందీలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. అక్కడ అమైరా నటిస్తున్న రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో రీసెంట్‌గా ఓ కొత్త ప్రాజెక్టుకు సైన్‌ చేసిందట. సినిమాల సంగతి అటుంచితే, యోగా బ్యూటీగా సోషల్‌ మీడియాలో రకరకాల ఆసనాలు వేస్తూ హాట్‌ హాట్‌ పిక్స్‌తో నెటిజన్స్‌ని పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. ఇది చూసిన నెటిజన్లు ఓ గ్లామర్‌ తారగా మాత్రమే తనని అభిమానిస్తున్నారు. 

 

కానీ తనలో ఎవరికీ తెలియని ఓ మంచి నటి దాగుందని చెబుతోంది. ఆ నటిని బయటికి తీసే నిఖార్సయిన ఛాన్స్‌ ఒక్కటొస్తే, తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది. దీపికా పదుకొనె నటించిన 'పద్మావత్‌' తరహా మూవీలో నటించాలన్నది తన కోరిక అంటోంది. ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానని కసిగా చెబుతోంది అందాల అమైరాదస్తూర్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS