ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌కి ప్యాషన్‌లో మంచి టేస్ట్ ఉంది. ఆమె అందాలారేసినా, మూసేసినా వచ్చే కిక్కే వేరప్పా. అదో రకం కిక్ అది అంతే. అందుకే ఆమె అందానికి దాసోహం అనని వారుండరంటే అతిశయోక్తి కాదు. శరీరాన్ని సన్నగా నాజూగ్గా ఉంచుకునేందుకు అమైరా దస్తూర్ చేసే కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. ఆ నాజూకు శరీరానికి అందుకే ఏ కాస్ట్యూమ్ వేసినా అంతందంగా ఫిట్ అయిపోతుంది మరి.
ఇక కసరత్తుల సంగతి పక్కన పెడితే, తాజాగా అమైరా దస్తూర్ పెళ్లి దుస్తుల్లో నిండుగా చందమామలా మెరిసిపోతోంది. బ్లాక్ కలర్ చెమ్కీలు పొదిగిన ఈ బ్రైడల్ వేర్ ఆమె అందాన్ని ఎన్ని రెట్లు చేస్తుందో చెప్పడం అంత వీజీ కాదండోయ్. చూసి తీరాల్సిందే. చూస్తున్నారుగా పిక్‌లో ఆమె అందాన్ని. పాపిట చంద్రవంక, ముక్కుకు ఆ ముక్కెర ఈ పెళ్లి కూతురు అందానికి మరింత అందం తెచ్చిపెడుతుండ్లా.!