గ్లామ్‌షాట్‌: బీచ్‌ ఒడ్డున 'రొమాంటిక్‌' స్టిల్‌.!

By Inkmantra - April 03, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

చల్ల చల్లని సాయంత్రం, భానుడి లేలేత కిరణాల్ని ఇక సముద్రుడు తనలో దాచేసుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. సరిగ్గా ఆ సమయాన్ని బీచ్‌ ఒడ్డున ఊహించుకోండి. ఆహా ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా. వర్ణనాతీతం. అలాంటి ఊహలో బీచ్‌ ఒడ్డున ఓ వయ్యారి భామ అందాలొలికిస్తే ఇంకెంత అందం.? ఆ అందాన్నే మన కళ్ల ముందుంచిందీ సొగసరి ముద్దుగుమ్మ. 

 

సైడ్‌ యాంగిల్‌లో ఉన్న ఈ బ్యూటీ స్వీట్‌ నేమ్‌ ఏంటో తెలుసా.? కేతికా శర్మ. పూరీ కంపెనీ నుండి దిగుమతి కాబోతోన్న ముద్దుగుమ్మ. పూరీ రూపొందిస్తున్న 'రొమాంటిక్‌' మూవీతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. హీరోయిన్‌గా పరిచయం కావడానికి ముందే ఈ భామ యూ ట్యూబ్‌ వీడియోలతో మస్త్‌ పాపులర్‌ అన్నమాట. ఆ పాపులారిటీకి ఇప్పుడు పూరీ 'రొమాంటిక్‌' మూవీ బాగా ఉపయోగపడుతోంది. ఇంకేముంది పాప ఇదిగో ఇలా చెలరేగిపోతోందంతే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS