అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అనసూయ.!

మరిన్ని వార్తలు

బుల్లితెర హాట్‌ సెన్సేషన్‌ అనసూయ భరద్వాజ్‌ ఓ పక్క బుల్లితెరపై హవా చూపిస్తూనే వెండితెరపైనా మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవతారమెత్తిందట. అయితే ఇది రియల్‌గా కాదులెండి. రీల్‌ కోసం. 'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అనసూయ సూపర్‌ హాట్‌గా కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది. 

 

అయితే ఆ వార్తల్ని అనసూయ కొట్టిపారేసింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా హుందాగా ఉంటుందనీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో తాను కనిపించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది. హాటెస్ట్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అనసూయ నటిస్తుందని గాసిప్స్‌ చక్కర్లు కొట్టాయింతవరకూ. కానీ అది పోలీసాఫీసర్‌ పాత్ర కాదనీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రనీ మన రంగమ్మత్త తేల్చేసింది. గతంలో 'క్షణం' మూవీలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అనసూయ నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర అనసూయకు మంచి గుర్తింపు తెచ్చిపపెట్టింది కూడా. 

 

ఇక రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన అనసూయ ఆ తర్వాత బాగా ఫేమస్‌ అయిపోయింది. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయి. వైఎస్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న 'యాత్ర'లో అనసూయ ఓ కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 8న 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక అనసూయ లీడ్‌ రోల్‌లో 'కథనం' అనే మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS