'ఆనందోబ్రహ్మ' ఫేం మహి.వి.రాఘవ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్ జీవితగాధగా తెరకెక్కుతోన్న మూవీ 'యాత్ర'. ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటికి వస్తున్నాయి. ఈ అప్‌డేట్స్‌ని ఫాలో అయితే, అసలింతకీ 'యాత్ర' బయోపిక్‌నా.? లేక కల్పిత గాధనా.? అనే అనుమానం వస్తోంది.
వైఎస్ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా ఆయన పాదయాత్ర ఘట్టాన్ని అభివర్ణించవచ్చు. ఆ ఘట్టాన్ని మెయిన్ పాయింట్‌గా తీసుకునే మహి ఈ సినిమాని తెరకెక్కించారు. పాదయాత్రలో వైఎస్‌ని ఇంప్రెస్ చేసిన ఎన్నో ఎమోషన్స్‌ని ఈ సినిమా ద్వారా చూపించారట. జగన్ పాత్రకు చోటు లేదన్నారు. అలాగే చంద్రబాబు పాత్రకు కూడా ఈ సినిమాలో ప్లేస్ లేదంటున్నారు. వైఎస్ జీవితంలో చంద్రబాబు పాత్రకు కీలకమైన చోటుంది. అయితే రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది ముఖ్యమైనది.
కానీ ఒకరిని మంచిగా చూపించేందుకు మరొకరిని చెడుగా చిత్రీకరించడం నా ఉద్దేశ్యం కాదని డైరెక్టర్ అంటున్నారు. ఆ కారణంగానే చంద్రబాబు పాత్రను టచ్ చేయలేదట. ఏది ఏమైనా ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా మహి ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఈ బయోపిక్ ఎంత మేర సక్సెస్ అవుతుందనే విషయంలో పెద్దగా అంచనాలు క్రియేట్ కావడం లేదు కానీ చూడాలి మరి. మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టి ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.