అనిల్‌రావిపూడి తో బాల‌య్య సినిమా ఎప్పుడు?

By iQlikMovies - January 24, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

'ఎఫ్ 2' హిట్టుతో అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అనిల్ క‌థ చెబుతానంటే, విన‌డానికి ఏ హీరో అయినా సిద్ధ‌మే. అయితే ఇది వ‌ర‌కే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ క‌థ చెప్పి ఓకే చేయించుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి 'రామారావు గారూ' అనే పేరు పెట్టిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి కూడా. 'ఎఫ్ 2' హిట్టుతో జోష్‌మీదున్న అనిల్.. బాల‌య్య‌తో సినిమా ప‌ట్టాలెక్కిస్తే బాగుంటుంద‌ని నంద‌మూరి అభిమానులు ఆశ ప‌డుతున్నారు.

 

అయితే బాల‌య్య - అనిల్ రావిపూడి సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే. ఎందుకంటే బాల‌య్య ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయాలి. ఏప్రిల్‌లో మొద‌ల‌య్యే ఈ సినిమా 2020 సంక్రాంతికి గానీ వ‌చ్చే అవ‌కాశాలు లేవు.  ఆ త‌ర‌వాతే బాల‌య్య ఖాళీ అవుతాడు. ఈలోగా... అనిల్ రావిపూడి మరో సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడు. ఈసారి అనిల్ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌పై దృష్టి పెట్టాడ‌ని తెలుస్తోంది. ఆ త‌ర‌వాతే... బాల‌య్య సినిమా ఉండ‌బోతోంది. అయితే ఈ లోగా ఎన్ని మార్పులైనా జ‌ర‌గొచ్చు. బాల‌య్య ప్లేసులోకి మ‌రో స్టారైనా రావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS