రవితేజ సినిమాలో జేజమ్మ.!

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లింది. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్‌ రాజా సరసన ఆర్‌ఎక్స్100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా కన్నా ముందే రవితేజ ఇంకో సినిమానీ స్టార్ట్‌ చేశాడు. అదే తమిళంలో ఘన విజయం సాధించిన 'తెరీ' రీమేక్‌. ఈ సినిమాకి సంతోష్‌ శివన్‌ దర్శకుడు. కొన్ని నెలల చిత్రీకరణ తర్వాత టెక్నికల్‌ కారణాలతో షూటింగ్‌కి చిన్న గ్యాప్‌ ఇచ్చారు. 

 

ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ సినిమా అతి త్వరలో పూర్తి కానుందనీ తాజా సమాచారమ్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా కేథరీన్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే, జేజమ్మ అనుష్క ఈ సినిమాలో నటిస్తోందనీ విశ్వసనీయ వర్గాల ద్వారా తాజాగా అందుతోన్న సమాచారమ్‌. 'బాహుబలి', 'భాగమతి' సినిమాల తర్వాత అనుష్క రీసెంట్‌గా 'సైలెన్స్‌' అనే మూవీకి సైన్‌ చేసింది. మాధవన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజా సమాచారమ్‌ ప్రకారం రవితేజ సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం అనుష్కను ఎంచుకున్నారనీ తెలుస్తోంది. 

 

అయితే ఈ సినిమాలో ఇదివరకటిలా అనుష్క, మాస్‌రాజాతో కలిసి గ్లామర్‌ స్టెప్పులేయదటండోయ్‌. ఓ డిగ్నిఫైడ్‌ రోల్‌లో కనిపించనుందట. పాత్ర నిడివి కూడా తక్కువేనట. కానీ సినిమాకి ఆ రోల్‌ వెరీ వెరీ ఇంపార్టెంట్‌ అనీ తెలుస్తోంది. గ్లామర్‌ పాత్రలతో పాటు, హుందా అయిన పాత్రలకీ మన స్వీటీ ఎంత వెయిట్‌ ఇస్తుందో ఆల్రెడీ చూసేశాం. అయితే ఈ 'తెరీ' రీమేక్‌లో అనుష్కని ఏ పాత్ర కోసం ఎంచుకున్నట్లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS