వెంకీ మామ జోరు మీదున్నాడోయ్‌.!

By Inkmantra - March 11, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

'ఎఫ్‌ 2' ఇచ్చిన జోష్‌తో వెంకటేష్‌ ఆ తర్వాత వెంటనే 'వెంకీ మామ' సినిమాని పట్టాలెక్కించేశాడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ స్టార్ట్‌ అయిన వెంకీ మామ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడ జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు, నాగచైతన్య, హీరోయిన్లు పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. 

 

కీలక సన్నివేశాల్లో భాగంగా పచ్చని పంట పొలాలు, కొబ్బరితోటలు, గోదారమ్మ గల గలల మధ్య చాలా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతోందట. ఈ వాతావరణాన్ని హీరోయిన్లు పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా జబర్దస్త్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని వెంకటేష్‌ భావిస్తున్నాడనీ తెలుస్తోంది. 'ఎఫ్‌ 2' సక్సెస్‌ తాలూకు జోరు ఇంకా తగ్గలేదు జనంలో. 

 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో 'ఎఫ్‌ 2'నే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిందింతవరకూ. అదే ఫామ్‌ని ఈ సినిమాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట మన వెంకీ. అంతేకాదు, ఈ సినిమా తర్వాత మళ్లీ ఫుల్‌ లెన్త్ ఎంటర్‌టైనర్‌లోనే నటించనున్నాడు వెంకీ. అదే 'ఎఫ్‌ 2' సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అనిల్‌, మహేష్‌ కోసం స్క్రిప్టు ప్రిపేర్‌ చేసే పనిలో బిజీగా ఉండడంతో, ఈ గ్యాప్‌లో వెంకీ 'వెంకీ మామ'ను కంప్లీట్‌ చేసేస్తాడన్న మాట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS