చరణ్‌ విలన్‌తో రెజీనా జోడీ.!

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'ధృవ' సినిమాతో విలన్‌గా పరిచయమయ్యాడు రొమాంటిక్‌ హీరో అరవింద్‌ స్వామి. అంతకు ముందు రొమాంటిక్‌ హీరోగా అరవింద్‌ స్వామికి సూపర్బ్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'ధృవ'తో డిఫరెంట్‌ క్రేజ్‌నీ, ఇమేజ్‌నీ సొంతం చేసుకున్నాడు అరవింద్‌ స్వామి. హీరోగా గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అరవింద్‌ స్వామి సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ మంచి చిత్రాలు ఎంచుకుంటున్నాడు హీరోగా కోలీవుడ్‌లో. 

 

తాజాగా అరవింద్‌ స్వామి 'కల్లపార్ట్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అరవింద్‌ స్వామికి జోడీగా అందాల రెజీనా నటిస్తోంది. రాజపాండి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అరవింద్‌ స్వామి ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్‌ గెటప్‌లోకి మారిపోనున్నాడట. స్టన్నింగ్‌ రోల్‌ అని తెలుస్తోంది. ఇక రెజీనా విషయానికి వస్తే, 'ఎస్సెమ్మెస్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. 

 

'అ' సినిమా కోసం డిఫరెంట్‌ గెటప్‌లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన రెజీనా తర్వాత తెలుగులో కనిపించలేదు. తమిళంలో 'చంద్రమౌళి' సినిమాతో విచ్చలవిడిగా అందాలారేసేసిందని వార్తల్లో నిలిచింది. ఇక ఈ తాజా మూవీలో అరవింద్‌కి జోడీగా నటిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. అరవింద్‌స్వామి మంచి నటుడనీ, ఆయనతో నటించడం ఆనందంగా ఉందని రెజీనా చెబుతోంది. ఈ సినిమాలో రెజీనా డాన్స్‌ టీచర్‌గా కనిపించనుంది. ఇటీవల 'ఏక్‌ లడ్‌కీ కో దేఖా..' అనే బాలీవుడ్‌ సినిమాతో రెజీనా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS