గత రెండు మూడు రోజుల నుంచీ... పేట తెలుగు సినిమా నిర్మాత వల్లభనేని అశోక్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో థియేటర్ల మాఫియా రాజ్యం ఏలుతుందని, నయీంని చంపినట్టు, ఈ మాఫియాని కూడా కాల్చి చంపేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఓ టీవీ డిబేట్ లో మరోసారి నిప్పులు చెలరేగారు. ఈసారి గీత దాటి మరీ మాట్లాడారు. “నిర్మాతల కుటుంబ సభ్యుల ఉసురు పోసుకునే బదులు వాళ్ళ అమ్మాయిలను ….. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు” అని దారుణంగా మాట్లాడారు. ''ఈ నలుగురినీ చెప్పులతో కొట్టే రోజు వస్తుంది'' అని పౌరుషంగా మాట్లాడారు. అంతేకాదు.. డిబేట్ మధ్యలోంచి లేచి వెళ్లిపోయారు. 'పేట' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అశోక్ చేసిన కామెంట్లకు చిత్రసీమ నుంచి ప్రతికూల స్పందన వస్తోంది.
అశోక్ అలా మాట్లాడాల్సింది కాదని పలువురు బడా నిర్మాతలు చెబుతున్నారు. ఈ కామెంట్స్‌పై ఇప్పటికే దిల్‌రాజు, బన్నీ వాసులు స్పందించారు. మరి తాజాగా ఇలా గీత దాటి మాట్లాడిన మాటలకు వాళ్ల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి. పండగ పూట.. కొత్త సినిమాలు వస్తున్న హడావుడిలో చిత్రసీమలో నిర్మాతలు ఇలా ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మాత్రం పరిశ్రమలో కలుషిత వాతావరణానికి అద్దం పడుతోంది.