పులిజూదం ట్రైలర్‌: మరోసారి శ్రీకాంత్‌ విలనిజం.!

మరిన్ని వార్తలు

తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన భారీ మల్టీస్టారర్‌ 'పులిజూదం'. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, తమిళ హీరో విశాల్‌, టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హన్సిక, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా మోహన్‌లాల్‌ నటిస్తుండగా, విశాల్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు.

 

రాశీఖన్నా పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటిస్తోంది. హన్సిక బార్‌ డాన్సర్‌ పాత్రలో కనిపిస్తోంది. ఇక టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా పేరున్న శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్నాడు ఈ సినిమాలో. హీరో కాకముందు విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్‌ ఇప్పుడు మళ్లీ విలన్‌ అవతారమెత్తాడు. గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'యుద్ధం శరణం' సినిమాతో విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినా, ఆ సినిమా ఫలితం బెడిసికొట్టడంతో, శ్రీకాంత్‌ విలనిజం హైలైట్‌ కాలేదు. 

 

తాజాగా 'పులి జూదం' సినిమా అంచనాలు నమోదు చేస్తోంది. హీరోగా ప్రస్తుతం అంతగా సక్సెస్‌ లేని శ్రీకాంత్‌కి ఈ సినిమా సక్సెస్‌ అయితే విలన్‌గా రాణించడం ఖాయమనిపిస్తోంది. ఇకపోతే మోహన్‌లాల్‌, శ్రీకాంత్‌ మధ్య యాక్షన్‌ సీన్లు, పవర్‌ఫుల్‌ డైలాగులు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. రాశీఖన్నా, హన్సికల పర్‌ఫామెన్స్‌తో పాటు, ఘాటు రొమాంటిక్‌ సీన్స్‌నీ కట్‌ చేశారు ట్రైలర్‌లో. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మల్టీ స్టారర్‌ మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS