'ఎన్టీఆర్‌' - ఈ మార్పుకు కారణమేంటి.?

By iQlikMovies - December 19, 2018 - 11:09 AM IST

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ని ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ స్వస్థలమైన నిమ్మకూరులో ప్లాన్‌ చేశారు. కానీ లాస్ట్‌ మినిట్‌లో ఈ ఈవెంట్‌ని తెలంగాణాకు మార్చేశారు. ఈ నెల 21న జరగబోయే ఎన్టీఆర్‌ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ని హైద్రాబాద్‌కు షిఫ్ట్‌ చేసినట్లుగా, తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

 

అయితే ఈ మార్పుకు కారణమేంటని వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా రాజకీయ కారణాలే ప్రధానమైనవి అని చెబుతున్నారు ఓ పక్క. ఈ మధ్య తెలంగాణా ఎలక్షన్స్‌కి సంబంధించి, తెలుగుదేశం పార్టీ తరపున జరిగిన ప్రచారంలో భాగంగా బాలకృష్ణ హైద్రాబాద్‌లో కొంచెం అతి చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ఇంపాక్ట్‌ 'ఎన్టీఆర్‌' సినిమాపై పడుతుందనే ఆడియో ఫంక్షన్‌ని షిప్ట్‌ చేశారట. అంతేకాదు, ఈ ఆడియో ఫంక్షన్‌కి తెలంగాణా ప్రముఖుల్లో పలువురును ఆహ్వానించే యోచనలో కూడా ఎన్టీఆర్‌ బృందం ఉన్నట్లు మరో సమాచారం. అయితే ఇదంతా ఒక వెర్షన్‌ మాత్రమే.

 

మరోవైపు పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా ఏపీలో వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఆ కారణంగానే ఈ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ని హైద్రాబాద్‌కి షిఫ్ట్‌ చేశామని చిత్రయూనిట్‌ నుండి మరో వెర్షన్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ విషయంలో బాలయ్య ముందుగానే జాగ్రత్త పడ్డాడనిపిస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ సంక్రాంతికి విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS