ప్చ్‌... 15 నుంచి 7కి ప‌డిపోయాడు!

మరిన్ని వార్తలు

ఒక్క సినిమా చాలు. బ‌ళ్లు ఓడ‌లుగా, ఓడ‌లు బ‌ళ్లుగా మారిపోవ‌డానికి. పారితోషికంలో, స్టార్ డ‌మ్‌లో తేడా.. ఒకే ఒక్క సినిమా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌నుని చూసి అర్థం చేసుకోవొచ్చు. టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి త‌ప్ప‌కుండా ఉంటాడు. జ‌య జాన‌కి నాయ‌క సినిమాకి ఆయ‌న పారితోషికం 15 కోట్లు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన విన‌య విధేయ రామ సినిమాకీ అంతే మొత్తం అందుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్‌తో... బోయాపాటి రేంజ్‌, పారితోషికం కూడా అమాంతంగా ప‌డిపోయాయి.

 

బోయ‌పాటి ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది వాళ్ల హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమా కోసం బోయ‌పాటి పారితోషికం 7 కోట్లుగా బాల‌య్య డిసైడ్ చేశాడ‌ట‌. విన‌య విధేయ రామా ఫ్లాప్ అవ్వ‌డంతో బాల‌య్య ఈ నిర్ఱ‌యం తీసుకున్నాడు. దానికి బోయ‌పాటి కూడా అభ్యంత‌రం చెప్ప‌లేద‌ట‌. పైగా బోయ‌పాటికీ బాల‌య్య‌కూ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఈ చిత్రానికి బాల‌య్యే నిర్మాత‌. అందుకే... బాల‌య్య నిర్ణ‌యానికి బోయ‌పాటి త‌లొంచ‌క త‌ప్ప‌లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS