ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో నందమూరి బాలకృష్ణ 'కథానాయకుడు' ఒకటి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఇది. పైగా బాలయ్య సినిమా. సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలన్నీ బాగా ఆడాయి. ఆ ధీమాతో భారీ రేట్లకు ఈ సినిమా కొనుగోలు చేశారు. కానీ.. బాక్సాపీసు దగ్గర ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాలయ్యపై, ఎన్టీఆర్‌పై నమ్మకంతో ఈసినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు బాగా నష్టపోయారు.
అందుకోసం 'మహానాయకుడు' సినిమాని బాలయ్య ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఫిబ్రవరిలో 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల కానుంది. 'కథానాయకుడు' సినిమాని కొన్న బయ్యర్లే మహానాయకుడినీ కొన్నారు. మహానాయకుడు విడుదలయ్యాక ముందు... 'కథానాయకుడు' తాలుకూ నష్టాల్ని పూడ్చుకుని, డబ్బులు మిగిలితే అప్పుడు నిర్మాతకు తిరిగి ఇస్తారన్నమాట.
ఓ రకంగా తన పంపిణీదారుల్ని బాలయ్య ఆదుకోవడానికి ముందుకొచ్చినట్టే. 'మహానాయకుడు' బాగుండి, నాలుగు డబ్బులొస్తే పంఫిణీదారులు ఒడ్డున పడినట్టే. అయితే.. ముందు అనుకున్నట్టుగా ఫిబ్రవరి 7న మహానాయకుడు విడుదల కావడం లేదు. ఓ వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 15న ఈ సినిమా వస్తోంది.