సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైంది 'వినయ విధేయ రామ'. తొలి షోకే ఫ్లాప్ టాక్ వచ్చినా.. సంక్రాంతి సీజన్ కాబట్టి... వసూళ్లు జోరుగానే అందుకుంది. కాకపోతే.. క్రమ క్రమంగా ఆ స్పీడు తగ్గింది. తొలి పదిరోజులకు చరణ్ సినిమా 60.9 కోట్లు సాధించింది. కొన్ని ఏరియాల్లో టాప్ 10 లిస్టులో చేరింది. కానీ ఏం లాభం..?? ఈ సినిమాకి నష్టాలు తప్పలేదు.
ప్రపంచ వ్యాప్తంగా రూ.95 కోట్లకు అమ్ముడపోయిందీ సినిమా. ఇప్పటికి అరవై వచ్చాయి. అంటే.. మరో రూ.35 కోట్లు నష్టాలన్నమాట. నైజాంలో రూ.12.50 కోట్లు, సీడెడ్‌లో రూ.11.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లు తెచ్చుకున్న చరణ్ సినిమా. ఓవర్సీస్‌లో 1.4 కోట్లతో సరిపెట్టుకుంది. చాలా ఏరియాల్లో యూవీ క్రియేషన్స్ ఈసినిమాని విడుదల చేసింది. ఈ ఫ్లాప్ ఎఫెక్ట్... యూవీ క్రియేషన్స్‌పై భారీగా పడినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
పది రోజుల లెక్కలు ఇవీ
నైజాం : 12.50 Cr
సీడెడ్ : 11.55 Cr
ఉత్తరాంధ్ర : 8.05 Cr
గుంటూరు : 6.26 Cr
ఈస్ట్: 5.23 Cr
వెస్ట్ : 4.25 Cr
కృష్ణా : 3.56 Cr
నెల్లూరు : 2.77 Cr
మొత్తం : 54.17 Cr
రెస్టాఫ్ ఇండియా : 5.35 Cr
ఓవర్సీస్ : 1.40 Cr
వరల్డ్ వైడ్ : 60.92 Cr