బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్లో భలే కిక్కు. వీరిద్దరి నుంచి రెండు సినిమాలొచ్చాయి. ఒకదాన్ని మించి మరోటి హిట్టయ్యింది. అందుకే ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని నందమూరి అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. వినయ విధేయ రామతో బోయపాటిపై కాస్త అదనపు ఒత్తిడి పెరిగింది. ఈసారి హిట్టు కొట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇది వరకు బోయపాటి ఏం చెబితే బాలయ్య అది వినేవాడు. కానీ.. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనూ మార్పులొచ్చాయని సమాచారం. తాజా చిత్రానికి బోయపాటి బడ్జెట్ లెక్కలు పూర్తి చేశాడట. ఈ సినిమా పూర్తి చేయడానికి రూ.70 కోట్లు కావాల్సిందే అంటున్నాడట. అయితే... బాలకృష్ణ మాత్రం ఈ బడ్జెట్లో భారీ కోత విధించినట్టు సమాచారం. ఈ సినిమాని 40 నుంచి 50 కోట్లలోపు పూర్తి చేయాలని ఆదేశించాడట.
ఎందుకంటే బాలయ్య సినిమా ఇప్పటి వరకూ 70 కోట్లు వసూలు చేసింది లేదు. పైగా ఎన్టీఆర్ - కథానాయకుడు 20 కోట్లే తెచ్చుకుంది. బోయపాటి చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సినిమా అనే సరికి బడ్జెట్ కంట్రోల్ మరింతగా పెరిగిపోతుంది కదా? అందుకే బాలయ్య ఈ ముందు జాగ్రత్త తీసుకున్నాడు.