దర్శ‌కుల సంఘంలోనూ... బోయ‌పాటి ఒంట‌రేనా..?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా న‌లుగుతున్న పేరు.. బోయ‌పాటి శ్రీ‌ను.  విన‌య విధేయ రామ ఎఫెక్ట్ బోయ‌పాటిపై ప‌డింద‌ని, ఈ సినిమా కోసం అందుకున్న పారితోషికంలో 5 కోట్లు తిరిగి ఇవ్వ‌లేక, నిర్మాత‌కు స‌మాధానం చెప్ప‌లేక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాడని టాక్‌. ఈ పంచాయితీ కొన్ని రోజులుగా అలా నలుగుతూనే ఉంది.

 

బోయ‌పాటి - దాన‌య్య ఇద్ద‌రూ తిట్టుకున్నార‌ని, దాన‌య్య బోయ‌పాటిపై చేయి కూడా చేసుకున్నాడ‌ని ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. అయితే మీడియా ముఖంగా ఎవ్వ‌రూ దీనిపై స్పందించ‌లేదు. ఓ ద‌ర్శ‌కుడి ఇమేజ్ ఈ విధంగా ఇంత దారుణంగా డామేజ్‌కి గురి కావ‌డం ఈమ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి. ఇంత జ‌రుగుతున్నా ద‌ర్శ‌కుల సంఘం ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. బోయ‌పాటి త‌ర‌పున మాట్లాడ‌లేదు. సంఘం మాట అటుంచండి.. అస‌లు ద‌ర్శ‌కులెవ‌రూ ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. 

 

అలాగ‌ని దాన‌య్య‌కు కూడా వ‌కాల్తా పుచ్చుకోలేదు. నిర్మాత‌ల‌లో కొంద‌రు దాన‌య్య వెన‌క ఉన్న‌ట్టు, ద‌ర్శ‌కుల‌లో ఒక‌రిద్ద‌రైనా బోయ‌పాటి త‌ర‌పున మాట్లాడాలి క‌దా? కానీ అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. ద‌ర్శ‌కుల సంఘంలో కూడా  ఈ ఇష్యూ ఇంత వ‌ర‌కూ చ‌ర్చ‌కే రాలేద‌ని తెలుస్తోంది. మ‌రి ద‌ర్శ‌కుల సంఘం ఏం చేస్తున్న‌ట్టో వాళ్ల‌కే తెలియాలి. ఈ విష‌యంలో బోయ‌పాటి కూడా చాలా అసంతృప్తికి గుర‌వుతున్నాడ‌ట‌. ద‌ర్శ‌కులెవ‌రూ త‌న‌కు స‌పోర్ట్ గా లేర‌ని సన్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS