'రాక్షసుడు'గా మారనున్న బెల్లంకొండ.!

By Inkmantra - February 21, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

తమిళంలో ఘన విజయం సాధించిన 'రాక్షసన్‌' మూవీని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రమేష్‌ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. 'కవచం'లో పోలీసాఫీసర్‌గా కనిపించిన బెల్లంకొండ మరోసారి ఈ సినిమా కోసం ఖాకీ డ్రస్‌ వేసుకోబోతున్నాడు. 

 

అనుకోకుండా పోలీసైన ఓ యువకుడు తన విధి నిర్వహణలో భాగంగా ఓ సైకో కిల్లర్‌ కేస్‌ని డీల్‌ చేయాల్సి వస్తుంది. ఆ సైకో కిల్లర్‌ని ఎదుర్కోవడంలో పోలీస్‌గా బెల్లంకొండ ఎదుర్కొన్న పరిస్థితులేంటీ.? అసలా సైకోని పట్టుకోవడానికి బెల్లంకొండ ఏం చేశాడు అనేదే ఈ సినిమా కథ. తమిళంలో విష్ణు విశాల్‌, అమలాపాల్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకుంది. 

 

తెలుగులో బెల్లంకొండకు జోడీగా హీరోయిన్‌ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కాజల్‌ అగర్వాల్‌ పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ కాజల్‌ - బెల్లంకొండ జంటగా 'కవచం' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ డైరెక్షన్‌లో 'సీత' మూవీ సెట్స్‌పై ఉంది. ముచ్చటగా మూడోసారి ఈ సినిమాలో కూడా కాజల్‌నే హీరోయిన్‌ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS