రాజకీయాలలో నైతిక విలువల గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. నిజానిజాల్ని, విలువల్ని పక్కన పెట్టి.. ఎదుటి వ్యక్తిపై, పార్టీపై ఎలా బురద చల్లాలా అని ఆలోచిస్తుంటారు. వాళ్ల వ్యక్తిగత జీవితాల్ని సైతం టార్గెట్ చేయడానికి వెనుకంజ వేయరు. అవసరమైతే.... పాత విషయాల్ని లాగడానికి కూడా రెడీ అయిపోతారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి కుట్రే జరగబోతోందని సీనీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాడు. పవన్ వల్ల ఓట్లు చీలిపోతాయని అధికార, ప్రతిపక్షాల నేతలు భయపడుతున్నారు. అందుకే ఎన్నికల ముందు పవన్ ఇమేజ్ డామేజ్ చేసేలా ఓ వర్గం శతవిధాలా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇది వరకు మీడియాకెక్కి, పవన్‌ని నానా బూతులు తిట్టి, ప్రచారాన్ని పోగేసుకున్న కొంతమందిని మళ్లీ రంగంలోకి దింపబోతున్నార్ట. అందుకోసం వాళ్లకి భారీ మొత్తంలో డబ్బుని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
పవన్ సంబంధాలు పెట్టుకున్నాడని భావిస్తున్న ఒకరిద్దరు కథానాయకల్ని మళ్లీ మీడియా ముందుకు తీసుకొచ్చి, పవన్‌పై వ్యతిరేకంగా కామెంట్లు చేయించాలని చూస్తున్నారట. దీని వెనుక ఉద్దేశం ఒకటే.. ఎన్నికల ముందు పవన్‌కి ఉన్న ఇమేజ్ అంతా ఒక్కసారిగా మరుగున పడిపోవాలి. మరందుకు ఆయా వ్యక్తులు సమ్మతిస్తారా? డబ్బు తీసుకుని పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకొస్తారా? దాని వల్ల పవన్ ఇమేజ్ డామేజ్ అవుతుందా? ఈ కుట్రకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు.? ఇవన్నీ కాలానికి వదిలేయాలి. ఏది ఏమైనా మీడియా వాళ్లకు మాత్రం రాబోయే రోజుల్లో బోలెడంత మసాలా కంటెంట్ దొరకడం మాత్రం ఖాయం.